: ఖైరతాబాదు కైలాస విశ్వరూప గణపతికి రెండు గంటలే విరామం!


హైదరాబాదులోని ఖైరతాబాదు గణేశ్ అంటేనే భారీ గణనాథుడు భక్తుల మదిలో మెదులుతాడు. యేటేటా ఒక్కో అడుగు పెరుగుతూ ఈసారి 60 అడుగులతో కైలాస విశ్వరూప గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. నిమజ్జనం కోసం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు మహా విగ్రహాన్ని చూసేందుకు వస్తుండటంతో మహాగణపతిని రాత్రి 2 గంటల వరకు దర్శించుకోవచ్చు. రెండు గంటల విశ్రాంతి తర్వాత మళ్లీ పూజలు ప్రారంభిస్తున్నారు. సోమవారం నిమజ్జనం సందర్భంగా ఇవాళ మహాగణపతి మండపం తొలగింపు పనులు చేపట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల సందడి ఉండటంతో వేకువ జామునే కొంత మేర తొలగిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సోమవారం ఉదయానికల్లా ఈ పనులు పూర్తవుతాయి. ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే పెద్ద విగ్రహం అని గుర్తింపు. ఆ మహా స్థానాన్ని ఒకేసారి తగ్గిస్తే భక్తుల నుంచి అసంతృప్తి వస్తుంది. అందుకే ఎలాగైతే విగ్రహం ఎత్తు పెంచుతూ వచ్చామో.. అలా విడతల వారీగా కొంత మేర తగ్గించే ఆలోచన ఉందని విగ్రహ శిల్పి రాజేంద్రన్ తెలిపారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి యేటా ఒక్కో అడుగు చొప్పున తగ్గిస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News