: వంశదార నదికి పెరిగిన వరద
శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదిలో వరద ఉద్ధృతి ఫెరిగింది. భారీగా వరదనీరు వచ్చి చేరడంతో గొట్టా బ్యారేజి నుంచి 22 గేట్లు ఎత్తి 81,239 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వంశధార వరద ఉద్ధృతితో 96 గ్రామాలకు ముప్పు ఏర్పడింది. మాతల వద్ద వరదనీటిలో పడి ఓ యువకుడు గల్లంతయ్యాడు.