: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన


అల్పపీడన ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాయలసీమలో చెదురుమదురు వర్షాలు కురవనున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. సాయంత్రంలోగా ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీనికి తోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News