: భారత్- ఇంగ్లండ్ మధ్య ఏకైక టీ20 మ్యాచ్ నేడే!
భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్ ఇవాళ జరగనుంది. డీడీ, స్టార్ 1 ఛానళ్లలో రాత్రి 7.30 నుంచి ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. టెస్టుల్లో మనం (భారత్) పరాజయం పాలైతే, వన్డేల్లో ఇంగ్లండ్ జట్టు చిత్తయ్యింది. మరి ఏకైక టీ20లో పైచేయి ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది. ఏమైనా, ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా విజయంతో ముగించాలని అభిమానులు ఆశ పడుతున్నారు. నాలుగో వన్డేలో ఆతిథ్య జట్టును 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన బర్మింగ్ హామ్ లో ఇవాళ టీ20 జరగబోతుండటం ధోనీ సేనకు కలిసొచ్చే అంశం. చివరి వన్డేలో ఇంగ్లండ్ గెలిచినప్పటికీ, పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆతిథ్య జట్టు కంటే భారత్ దే పై చేయి అనడంలో సందేహం లేదు. అందుకే ఈ మ్యాచ్ లో అందరూ ధోనీ సేననే ఫేవరెట్ గా పరిగణిస్తున్నారు. వన్డే సిరీస్ లో సత్తా చాటిన సురేశ్ రైనా, రహానె, ధావన్ ల మీదే అందరి దృష్టి నిలిచి ఉంది.