: తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 22 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తుల దివ్య దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. తిరుమలలో అద్దె గదులు దొరకక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం నాడు శ్రీవారిని 67,844 మంది భక్తులు దర్శించుకున్నారు.