: జమ్మూ కాశ్మీర్ లో వరద బీభత్సం... 115 మంది మృత్యువాత
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టించింది. గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు పొంగి పొర్లుతున్నాయి. వరదల ధాటికి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 115కి చేరింది. రాష్ట్రంలో వరదల పరిస్థితిని కేంద్ర మంత్రులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా ఆయన ఏరియల్ సర్వే చేయనున్నారు.