: సెటిల్మెంట్ వ్యవహారంలో టీవీ యాంకర్ అరెస్టు... రూ.కోటి స్వాధీనం
విజయవాడలో ఓ టీవీ యాంకర్ సెటిల్మెంట్ వ్యవహారంలో పోలీసులకు పట్టుబడడం సంచలనం రేపుతోంది. ఈ సెటిల్మెంట్ విషయమై పక్కా సమాచారంతో దాడులు చేసిన పటమట పోలీసులు సదరు యాంకర్ ను అరెస్టు చేశారు. యాంకర్ నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తి పలు చానళ్ళకు ఫ్రీలాన్స్ యాంకర్ గా పనిచేసిన సినీ నటుడు హర్షవర్థన్ అని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.