: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం... కోస్తాంధ్రకు వర్షసూచన


ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరాలకు సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. మరోవైపు, ఉపరితల ఆవర్తనం స్థిరంగా ఉంది. కాగా, అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో చెదురుమదురు వానలు, కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. కోస్తాంధ్రలో తీరం వెంబడి 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News