: సానియా యూఎస్ ఓపెన్ టైటిల్ 'తెలంగాణ'కు అంకితం
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో తాను గెలిచిన మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను సానియా మీర్జా దేశానికీ, తెలంగాణ రాష్ట్రానికీ అంకితమిచ్చింది. బ్రెజిల్ క్రీడాకారుడు బ్రూనో సోరెస్ తో కలిసి మిక్స్ డ్ డబుల్స్ విభాగం ఫైనల్లో నెగ్గిన అనంతరం సానియా పీటీఐతో మాట్లాడింది. "ఎంతో సంతోషంగా ఉంది. బ్రూనోతో కలిసి నెగ్గడం గొప్పగా ఉంది. తొలిసారి తామిద్దరం జోడీ కట్టి, మంచి ఫలితాలను రాబట్టాం. ఈ విజయాన్ని భారత్ లోని ప్రతి ఒక్కరికీ, తెలంగాణ రాష్ట్రానికి, అక్కడి ప్రజలకు అంకితమిస్తున్నా" అని పేర్కొంది. కల నిజమైందని, ఇలాంటివే మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నానని సానియా తెలిపింది.