: ట్విట్టర్ లో అమితాబ్ కోటీశ్వరుడు!
బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ను ట్విట్టర్ లో ఫాలో అవుతున్న వారి సంఖ్య అక్షరాల కోటికి చేరింది. ఈ అమితానందంలో ఆయన తన ఫాలోయర్స్ సంఖ్యను సూచిస్తూ కవర్ పేజీని మార్చారు. నేటికి ఆయనను 1,01,13,123 మంది అనుసరిస్తున్నారు. తన ట్విట్టర్ పేజీని ప్రారంభించినప్పటి నుంచీ బిగ్ బీ ఎప్పుడూ అభిమానులకు, స్నేహితులకు అందుబాటులో ఉంటున్నారు. అంతేకాదు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్య విషయాలు, పాత జ్ఞాపకాలు, కొత్త సినిమాలు గురించి ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉంటారు. తనకు తోచిన విషయాలను తెలుపుతూ సూచనలు, సలహాలు కూడా ఇస్తుంటారు. అందుకే, ఆయనను అంతమంది అభిమానులు నిరంతరం అనుసరిస్తారనడంలో సందేహంలేదు.