: హైదరాబాదు ఫలక్ నుమా ప్యాలెస్ లో సల్మాన్ సోదరి వివాహం
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం ఎక్కడనేది ఖరారయింది. హైదరాబాదులోని తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో వచ్చే ఏడాది జనవరిలో తమ కుమార్తె పెళ్లి వేడుక జరగనున్నట్లు తండ్రి సలీమ్ ఖాన్ వెల్లడించాడు. అయితే, ఇంకా తేదీ ఖరారు కాలేదని చెప్పారు. వివాహాన్ని చాలా ప్రశాంతంగా జరపాలని అనుకుంటున్నామని, ఫలక్ నుమా ప్యాలెస్ మంచి వెన్యూ కావడంతో దాన్నే వేదికగా ఎంచుకున్నట్లు సలీమ్ తెలిపారు. ఢిల్లీకి చెందిన ఆయుష్ శర్మ, సల్మాన్ సోదరి అర్పిత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వారి వివాహానికి ఇరు కుటుంబాలు కూడా ఆంగీకరించడంతో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ వివాహం ముస్లిం, హిందూ సంప్రదాయాల ప్రకారం ఉంటుందని అంటున్నారు.