: జమ్మూకాశ్మీర్ వరదలను'జాతీయ విపత్తు'గా ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్
తీవ్ర వరదల కారణంగా జమ్మూకాశ్మీర్లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. మరోవైపు, ఇప్పటికే మృతుల సంఖ్య వందకు చేరగా, అటు, వేలమందిని రెస్క్యూ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటు, భారీ వర్షాల కారణంగా నదుల్లో ప్రవాహ తీవ్రత పెరిగి, పరిస్థితి వరదలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో, జమ్మూకాశ్మీర్ వరదలను 'జాతీయ విపత్తు'గా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ విజ్ఞప్తి చేశారు. ఈ ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకుని వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో చర్చించారు.