: వన్డే వరల్డ్ కప్ విజయవంతమవ్వాలి: అబ్బాట్ తో మోడీ
వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ కు శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్ టోర్నీ విజయవంతమవ్వాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. భేటీలో వీరిరువురి మధ్య పలు క్రీడా వ్యవహారాలు చర్చకు వచ్చాయి. క్రికెట్, హాకీపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్ లో క్రీడా విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సహకరించాలని మోడీ ఆసీస్ ప్రధానిని కోరారు. కాగా, వన్డే వరల్డ్ కప్-2015 ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు జరగనుంది.