: అసెంబ్లీని తక్షణమే సమావేశపరచాలని జానారెడ్డి డిమాండ్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని తక్షణమే సమావేశపరచాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. ఈ మేరకు ఆయన గవర్నర్ నరసింహన్ కు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు లేఖలు రాశారు. సమావేశాలు జరిపి విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు రుణమాఫీ, సంక్షేమ పథకాల అమలు వంటి తదితర అంశాలపై చర్చించాలని లేఖలో ఆయన కోరారు.