: మోడీని కలిసి మురిసిపోయిన ఆసీస్ క్రికెట్ దిగ్గజాలు


ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ తో పాటు భారత్ లో పర్యటిస్తున్న క్రికెట్ దిగ్గజాలు ఆడమ్ గిల్ క్రిస్ట్, బ్రెట్ లీ ప్రధాని నరేంద్ర మోడీని కలవడం పట్ల మురిసిపోతున్నారు. ఆయనను కలిసిన సందర్భంగా తీయించుకున్న ఫొటోలను వారు ట్విట్టర్ లో పెట్టారు. భారత ప్రధాని మోడీతో కలిసి విందులో పాల్గొనడాన్ని తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ట్వీట్ చేశారు. కాగా, ఆసీస్ ప్రధాని అబ్బాట్, గిల్ క్రిస్ట్, బ్రెట్ లీ భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను కూడా కలిశారు. ఈ సందర్భంగా వన్డే వరల్డ్ కప్ తో ఫొటోలకు పోజులిచ్చారు.

  • Loading...

More Telugu News