: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. ఉదయం ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ తీవ్ర వాగ్వివాదాలు, నిరసనలు, ఆందోళనలతో కొనసాగింది. తీవ్ర చర్చల అనంతరం సభ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపింది. చట్టసభల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సభ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల నడుమ వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. దీంతో, బడ్జెట్ సమావేశాలు ముగిసినట్టైంది.