: వీరంగమేసిన టీచర్ సస్పెన్షన్
పాఠశాలలో మద్యం తాగి వీరంగమేసిన ఓ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గొట్టిముక్కల ప్రాథమికోన్నత పాఠశాలలో హలీం అనే ఉపాధ్యాయుడు పూటుగా తాగి వీరంగమేశాడు. అతని నిర్వాకం పత్రికలు, టీవీ ఛానళ్లలో ప్రసారం కావడంతో విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు అతని తీరుపై మండిపడ్డారు. అతని నిర్వాకంపై జిల్లా విద్యాశాఖను నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. అతని క్రమశిక్షణా రాహిత్యంపై నివేదిక తయారు చేసిన ఉన్నతాధికారులు, ఆ నివేదికను డీఈవో కు అందజేశారు. దానిని పరిశీలించిన అనంతరం ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.