: బీసీలకు రాజ్యాధికారం టీడీపీతోనే: బాబు


బీసీలకు రాజ్యాధికారం టీడీపీతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, చేతి వృత్తులకు టీడీపీ ఆదరణ కల్పిస్తుందన్నారు. చేతి వృత్తుల వారు ఎవరైనా గాయపడితే లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తామని అన్నారు. అలా కాకుండా ఎవరైనా మృతి చెందితే ఎన్నికల్లో ప్రకటించినట్టు రెండు లక్షలు కాకుండా, 5 లక్షల రూపాయలు పరిహారంగా అందజేస్తామని అన్నారు. ఆదరణ పథకం కింద కుల వృత్తులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. చేతి వృత్తులకు సేవల పన్ను రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. చేతి వృత్తుల వారికి ఇళ్ళు కేటాయిస్తామని అన్నారు. చేనేతలను ఆదుకుంటామని అన్నారు. గీత కార్మికులను ఆదరిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని మత్స్యకారులు మర పడవల్లో సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టుకోవడానికి డీజిల్ అందజేసే ఆలోచన చేస్తున్నామని అన్నారు. చేపల వేట ఆగినప్పుడు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. సముద్రంలో ఎవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందితే ఏడేళ్ల తరువాత లక్ష రూపాయలు నష్టపరిహారం అందజేస్తున్నారని, దానిని మార్చి రెండేళ్లకే ఐదు లక్షల రూపాయలు అందేలా చొరవ తీసుకుంటామని అయన తెలిపారు. అలాగే ప్రభుత్వం తరపున గొర్రెల విక్రయకేంద్రాలు పెడతామని ఆయన వెల్లడించారు. రజకులకు దోభీఘాట్ లు నిర్మిస్తామని ఆయన చెప్పారు. పుట్టువెంట్రుకలు తీసే నాయీ బ్రహ్మణులచేత బ్యూటీ సెలూన్లు పెట్టించే ఆలోచనలో ఉన్నామని ఆయన వెల్లడించారు. బీసీల్లో చాలా కులాలు ఎస్సీ, ఎస్టీల్లో చేర్చాలని కోరుతున్నారని, దానిని కూడా పరిశీలిస్తామని ఆయన వివరించారు. ఈ మేరకు టీడీపీ తీర్మానం చేస్తుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News