: ఢిల్లీలో ప్రధాని మోడీని కలసిన కేసీఆర్
ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా మోడీకి పూలబొకే ఇచ్చారు. పార్టీ ఎంపీలు కే.కేశవరావు, వినోద్, కవిత తదితరులు ప్రధానితో జరుగుతున్న సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రధాన సమస్యలను ఈ భేటీలో పీఎంకు ఆయన ఏకరవు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అనంతరం రాష్ట్రపతితో కేసీఆర్ సమావేశమవుతారు.