: మూఢనమ్మకంతో కూతుర్ని, భార్యను చావబాదాడు


సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందామో అంతే తీవ్రంగా మూఢనమ్మకాలు కూడా ప్రబలుతున్నాయి. విజయనగరం జిల్లా అనంతగిరి మండలం నందకోటలో దారుణం చోటు చేసుకుంది. దెయ్యం పట్టిందనే మూఢనమ్మకంతో ఓ వ్యక్తి కుమార్తెను, భార్యను కర్రతో చితకబాదాడు. ఈ దాడిలో కుమార్తె మృతి చెందగా, తీవ్రగాయాలపాలైన భార్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News