: బస్టాండులో పది వేల బ్లూఫిల్మ్ సీడీలు స్వాధీనం


తమిళనాడులోని కోయంబేడు బస్టాండ్ లో పది వేల నీలి చిత్రాల సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున అక్కడి బస్టాండ్ లో రెండు పెద్ద సూట్ కేసులు అనుమానాస్పదంగా కనిపించాయి. వీటిపై కోయంబేడు డిప్యూటీ కమిషనర్ కు సమాచారం అందింది. వెంటనే హుటాహుటీన బస్టాండ్ కు చేరుకున్న డిప్యూటీ కమిషనర్ టీమ్ సూట్ కేసులు తెరచింది. రెండు సూట్ కేసుల నిండా కవర్లు లేకుండా సీడీలు దర్శనమిచ్చాయి. వీటిని ప్లే చేసి చూడగా నీలి చిత్రాలని నిర్ధారణ అయింది. ఇవి ఆంధ్రా నుంచి తీసుకువచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిఘా కట్టుదిట్టంగా ఉండడంతో భయపడి వాటిని విడిచిపెట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News