: శ్రీవారి సన్నిధిలో సినీనటి స్నేహ దంపతులు
తిరుమల శ్రీవారిని సినీనటి స్నేహ దంపతులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో స్నేహ దంపతులు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ మెంబర్ ఎం.రవిబాబు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.