: త్రీడీ ప్రింటర్ తో ఆయన ఇల్లు కట్టేశాడు


త్రీడీ ప్రింటింగ్ రంగంలో సరికొత్త ఆవిష్కరణకు యాండ్రీ కుడెంకో తెరతీశారు. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రానికి చెందిన యాండ్రీ కుడెంకో త్రీడి ప్రింటింగ్ తో ఓ భవనాన్ని నిర్మించి ప్రపంచాన్ని ఆశ్చర్యానందంలోకి తీసుకెళ్లారు. కాంక్రీటును ప్రింటు చేసే విధానం ద్వారా ఆయన 3x5 మీటర్ల భవంతిని రూపొందించారు. త్రీడీ ప్రింటర్ల రంగంలో పూర్తిస్థాయి భవనాన్ని నిర్మించిన తొలి వ్యక్తిగా యాండ్రీ కుడెంకో రికార్డులకెక్కారు. ఆర్డ్యూనో మైక్రోకంట్రోలర్ ను వినియోగించి ఆయన ఈ ఘనత సాధించారు. వాణిజ్య పరంగా దీనిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నానని తెలిపిన ఆయన, భవన నిర్మాణ రంగ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. ఈ విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అతి తక్కువ ఖర్చుతో కూలీల అవసరం లేకుండా మంచి ఇళ్లు నిర్మించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News