: సత్తా చాటిన ఇంగ్లండ్ బౌలర్లు... సిరీస్ ఓడినా పరువు కాపాడుకున్నారు


ఇంగ్లండ్ పర్యటనలో వన్డే సిరీస్ ను క్లిన్ స్వీప్ చేసి టెస్టు సిరీస్ పరాజయానికి బదులిద్దామని ప్రయత్నించిన టీమిండియా ఆశలు నెరవేరలేదు. ఐదు వన్డేల సిరీస్ లో మూడు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా సిరీస్ ను గెలుచుకోగా, చివరి వన్డేలో ఇంగ్లండ్ బౌలర్లు ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించి పరువు కాపాడారు. టెస్టుల్లో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ ఆటగాళ్లు వన్డేల్లో తేలిపోయారు. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆటతీరుపై తీవ్ర విమర్శలపాలయ్యారు. ఇంగ్లండ్ ఇలాగే ఆడితే వరల్డ్ కప్ సంగతి దేవుడెరుగు, గుడ్డు కప్పు తెస్తుందని మాజీ కెప్టెన్ ఇయాన్ బోధమ్ ఎద్దేవా చేశారు. ఆయన విమర్శల దాడి ఫలితమో, లేక పరువు పోతుందని అనుకున్నారో కానీ, ఇంగ్లీష్ బౌలర్లు చివరి వన్డేలో జూలు విదిల్చారు. ఫలితంగా టీమిండియాను 41 పరుగుల తేడాతో ఓడించి సత్తాచాటారు. లీడ్స్ వేదికగా జరిగిన ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 294 పరుగులు చేసింది. అనంతరం 295 పరుగుల విజయలక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. టీమిండియా టాపార్డర్ బోల్తా కొట్టడంతో టీమిండియా ఆదిలోనే కష్టాల్లో పడింది. అవకాశం వచ్చిన ప్రతిసారీ రాణిస్తున్న రాయుడు (53) మరోసారి అర్థసెంచరీతో రాణించాడు. ధావన్ 31, ధోనీ 29, అశ్విన్ 16, కోహ్లీ 13 పరుగులు చేయగా, చివర్లో జడేజా (87) ఒంటరి పోరాటం చేశాడు. టెయిలెండర్లు వెనుదిరుగుతున్నా ధైర్యంతో విరుచుకుపడ్డాడు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో, టీమిండియా 253 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. దీంతో వన్డే సిరీస్ ను 3-1 తేడాతో టీమిండియా గెల్చుకుంది. ఒక వన్డే వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News