: గుండె పోటు ప్రమాదమా... మనింట్లోనే పరిష్కారం ఉంది!


వయసు పెరిగినవారిలో గుండెపోటు ముప్పు పొంచి ఉంటుంది. అయితే, సాధారణంగా సంభవించే గుండెపోటు నివారణకు చక్కని పరిష్కారం మన ఇళ్లలోనే ఉందని పరిశోధకులు చెబుతున్నారు. పొటాషియం సమృద్ధిగా లభించే ఆలుగడ్డలు, అరటిపళ్లు, కూరలను తీసుకుంటే గుండె ప్రమాదాన్ని అడ్డుకున్నట్టేనని పరిశోధకులు వెల్లడించారు. 50 నుంచి 79 ఏళ్ల వయసున్న సుమారు 90 వేల మంది మహిళలపై 11 ఏళ్లపాటు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్టు పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం కోసం వారి ఆరోగ్యం, ఆహారపు అలవాట్లను పరిశీలించారు. అధ్యయన కాలంలో మృతిచెందిన వారి ఆరోగ్యపరిస్థితిని, మరణానికి కారణాలను కూడా పరిశోధకులు విశ్లేషించారు. రోజూ సుమారు 2,611 మిల్లీగ్రాముల పొటాషియంను ఆహారం ద్వారా స్వీకరించే మహిళలకు గుండెపోటు ముప్పు తక్కువని పరిశోధకులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News