: క్లీన్ స్వీప్ అసాధ్యమే... టీమిండియా 119/4


ఇంగ్లండ్ వన్డే సిరీస్ ను క్లిన్ స్వీప్ చేద్దామన్న టీమిండియా ఆశలు అడియాసలయ్యేలా కనబడుతున్నాయి. ఐదు వన్డేల సిరీస్ లో మూడు వన్డేలను ఒంటి చేత్తో గెలుచుకున్న టీమిండియా చివరి వన్డేలో టెస్టుల్లో ప్రదర్శించిన ఆటతీరునే ప్రదర్శించింది. గాడిన పడ్డారు రాణిస్తున్నారు అనే దశలో టీమిండియా టాపార్డర్ బోల్తా కొట్టింది. సెంచరీతో మూడో వన్డేలో రాణించిన రహానే డకౌట్ గా వెనుదిరిగితే, నాలుగో వన్డేలో సెంచరీ చేరువకు వచ్చిన ధావన్ 31 పరుగులకే వెనుదిరిగాడు, ఇంగ్లండ్ టూర్ అచ్చిరాని కోహ్లీ (13)ది పాత కథే, రెండో వన్డేలో చెలరేగి ఆడి సెంచరీ చేసిన రైనా (18) విఫలమయ్యాడు. కెప్టెన్ ధోనీ (12)తో కలిసి... వన్డేల్లో చోటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో తెలియక, అవకాశం వచ్చిన ప్రతిసారీ రాణిస్తున్న రాయుడు (44) మరోసారి క్రీజులో కుదురుకున్నాడు. దీంతో 27 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయిన టీమిండియా కేవలం 119 పరుగులు చేసింది. 22 ఓవర్లలో విజయానికి 176 పరుగులు కావాల్సి ఉండగా, ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News