: చైనా సరిహద్దుల్లో పరిస్థితిని మోడీకి వివరించిన ఆర్మీ చీఫ్
భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ సమావేశమయ్యారు. భేటీ సందర్భంగా చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితిని ఆర్మీ చీఫ్ మోడీకి వివరించారు. సరిహద్దుల్లో భద్రతకు సంబంధించిన కీలక విషయాలపై ప్రధానికి ఆర్మీచీఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధావల్ కూడా పాలుపంచుకున్నారు.