: ఇదీ కేసీఆర్ ఢిల్లీ షెడ్యూల్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరి వెళుతున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేసి ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రధానితో కేసీఆర్ భేటీ అవుతారు. మధ్యాహ్నం ఒంటి గంట 15 నిమిషాలకు రాష్ట్రపతిని ఆయన కలవనున్నారు. మధ్యాహ్నం 2.30కి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో కేసీఆర్ సమావేశమవుతారు. అలాగే కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ కుమార్ లతో కేసీఆర్ సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చిస్తారు.

  • Loading...

More Telugu News