: ముస్లిం ఆందోళనకారులకు పూల బొకేలు పంపిన క్రైస్తవ నేత


పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను గద్దె దించాలని కంకణం కట్టుకుని ఆందోళన చేస్తున్న ముస్లిం నిరసనకారులకు క్రైస్తవ నేత పుష్పగుచ్ఛాలు పంపారు. ఎండ వానల్ని సైతం లెక్క చేయకుండా పాకిస్థాన్ పార్లమెంటు వెలుపల ఆందోళన చేస్తున్న వారికి జే సాలిక్ అనే క్రిస్టియన్ నేత 200 పూల బొకేలను పంపారు. ఈ పుష్పగుచ్ఛాలపై ఇంకిలాబ్ మార్చ్ అని రాసి ఉందని పాక్ మీడియా వెల్లడించింది. గత వారం రోజులుగా తెహ్రికే ఎ ఇన్సాఫ్, పాకిస్థానీ అవామీ తెహ్రికే పార్టీలు ఈ ఆందోళనను నిర్వహిస్తున్నాయి.

  • Loading...

More Telugu News