: విజయవాడను రాజధానిగా ప్రకటించడం సంతోషకరం: ఎంపీ మురళీమోహన్
విజయవాడను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానిగా ప్రకటించడం సంతోషదాయకమని ఎంపీ మురళీమోహన్ అన్నారు. రాజధాని ప్రకటనను ఏకగ్రీవంగా అంగీకరించడం శుభపరిణామమని, ప్రతి ఒక్కరూ రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆయన అభిలషించారు. అయితే, నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదులా అభివృద్ధి సాధించేందుకు కొన్ని దశాబ్దాలు పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను తరలించడం కష్టమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి 50 ఏళ్లు పట్టిందని ఆయన చెప్పారు. ఇప్పటికిప్పుడు విశాఖకు గానీ, రాజమండ్రికి గానీ వెళ్లడం కుదరదని మురళీమోహన్ స్పష్టం చేశారు.