: ఆమె నా గురువు... అంతకంటే ఎక్కువే!: సినీ నటుడు జయప్రకాశ్


టీచర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ టీచర్లతో అనుబంధం గుర్తు చేసుకుంటున్నారు. అందులో భాగంగా టీచర్ గా పని చేసిన సినీ నటుడు జయప్రకాశ్ తన గురుదైవం గురించి తలచుకున్నారు. ఆమె టీచరే కానీ అంతకంటే ఎక్కువ అని తెలిపారు. అరచేతిని తిరగేయమని మోచెయ్యిపై చెక్క స్కేలుతో కొడుతుంటే టీచర్ అంటే ఎక్కడలేని కోపం వచ్చేదని అన్నారు. అదే టీచర్ మధ్యాహ్నం భోజన సమయంలో పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెడుతుంటే అమ్మ గుర్తొచ్చేదని అన్నారు. ఆ టీచర్ పేరు ఆరోగ్యమ్మ అని, ఓనమాలు నేర్పిన నాటి నుంచి ఆమె కన్ను మూసేవరకు ఆమెతో తన అనుబంధం కొనసాగిందని ఆయన గుర్తు చేసుకున్నారు. తనకు విద్యాదానం చేసిన ఆమెను జీవితాంతం మర్చిపోలేనని ఆయన తెలిపారు. తన జీవితంపై ఆమె ప్రభావం చాలా ఉందని ఆయన తెలిపారు. టీచరయ్యాక, సినీ నటుడిని అయ్యాక కూడా ఆమెతో తన అనుబంధం మారలేదని, ఆమె ఇంటికి వెళ్లి తన చిన్ననాటి విషయాలు గుర్తు చేసేవాడినని ఆయన తన గురువు గొప్పదనాన్ని చెప్పారు. తాను నటుడవ్వడానికి కారణం గుండాచారి అనే సైన్సు టీచర్ అని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News