: జై తెలంగాణ అనాల్సింది పోయి... జై జన్మభూమి అనేశారు!


ఖమ్మం జిల్లా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు సైకిల్ దిగి కారెక్కిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తుమ్మలతో పాటు ఆయన అనుచరులకు గులాబీ కండువాలు కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుమ్మల ప్రసంగించారు. ప్రసంగాన్ని ముగిస్తూ ఆయన జైహింద్, జై జన్మభూమి అంటూ ముగించారు. తెలుగుదేశం పార్టీలో ఉండి, అలవాటులో పొరపాటుగా ఆయన జై జన్మభూమి అని, ఆనక నాలుక్కరుచుకున్నారు. అయితే, ఆయన నోటి వెంట ఇక మీదట జై తెలంగాణ అని వస్తుందేమో!

  • Loading...

More Telugu News