: వీధి కుక్కతో యువతి పెళ్ళి!
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలోనూ ప్రజలు మూఢనమ్మకాలను వీడడంలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ జాఢ్యం ఎక్కువగా ఉంది. అందుకు నిదర్శనంలా... జార్ఖండ్ లోని ఓ కుగ్రామంలో మంగ్లీ ముండా అనే 18 ఏళ్ళ యువతికి షేరూ అనే వీధి కుక్కతో పెళ్ళి చేశారు. ఆమెను పెళ్ళి చేసుకునేవాడు చనిపోతాడని, ముందు కుక్కతో వివాహం చేస్తే ఆ దోషం తొలగిపోతుందన్నది వారి నమ్మకం. ఆ అమ్మాయి కుక్కను పెళ్ళాడితే, దోషం కాస్తా కుక్కపైకి మరలుతుందట. ఆ తర్వాత ఆమె వివాహం చేసుకుంటే, భర్త ప్రాణాలకు ఢోకా ఉండదని ఆ గ్రామపెద్దలు చెబుతున్నారు. పాపం, మంగ్లీకి ఈ అనాగరిక చర్య ఇష్టం లేకపోయినా, గ్రామపెద్దలు చెప్పడంతో పెళ్ళికి అంగీకరించక తప్పలేదు.