: మంత్రికి లేఖతోపాటు 'చాకు'ని పంపారు!


దక్షిణ కొరియా రక్షణ మంత్రికి ఇటీవల ఓ లేఖ రాగా, అందులో కూరలు తరిగే చాకు ఉండడం కలకలం రేపింది. ఆ చాకుకు ఒకవైపున మంత్రి పేరు 'హాన్ మిన్ కూ' అని ఉండగా, మరోవైపున 'మరణదండన' అని రాసి ఉంది. ఈ ఘటనపై దక్షిణ కొరియా పోలీసులు, సైన్యం సంయుక్తంగా దర్యాప్తును ఆరంభించాయి. పోస్టుమ్యాన్ ఓ చిరిగిపోయిన కవర్ ను తిరిగి అతికించేందుకు ప్రయత్నిస్తుండగా, ఆ దృశ్యం అధికారుల కంటబడింది. పరిశీలించి చూస్తే, ఆ లేఖ రక్షణ మంత్రికి వచ్చినట్టు తేలింది. విప్పిచూస్తే చాకు బయటపడింది. ఈ ఘటనలో ఒకవేళ ఉత్తరకొరియా ప్రమేయం ఉందేమోనన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు. ఈ లేఖను 'ఇంటర్నేషనల్ పీస్ యాక్షన్ కార్ప్స్' సంస్థ పంపింది.

  • Loading...

More Telugu News