: 40 రూపాయల కోసం ఓ వ్యక్తిని చంపేశాడు
భోజనం, 40 రూపాయల కోసం ఓ వ్యక్తి యజమానితో గొడవ పడ్డాడు. ఈ ఘర్షణ తీవ్రం కావడంతో యజమానిని కత్తితో పొడిచి చంపేశాడు. జార్ఖండ్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఘాట్ శిల సమీపంలోని బీటర్ మింద గ్రామంలో ఓ వృద్ధుడు పశువులను మేపడానికి ఓ వ్యక్తిని రోజువారీ కూలీగా పనిలో పెట్టుకున్నాడు. రోజుకు కాస్త భోజనం, 40 రూపాయలు ఇచ్చేలా మాట్లాడుకున్నాడు. అయితే గురువారం భోజనం, డబ్బు ఇవ్వడంలో ఆయన ఆలస్యం చేశాడు. ఈ విషయంపై కూలీ యజమానితో గొడవకు దిగి... కత్తితో పొడిచి హతమార్చాడు. పోలీసులు నిందితుడుని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.