: విద్యార్థులను నవ్వించిన మోడీ...ప్రశ్నోత్తరాల్లో స్ఫూర్తి రగిలించిన మోడీ


'ముఖ్యమంత్రిగా పని చేసినప్పటికి, ఇప్పటికీ తేడా ఏమిటి?' అని ప్రధానిని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు, మోడీ నవ్వుతూ నవ్విస్తూ సమాధానమిచ్చారు. "పెద్ద తేడా ఏమీ లేదు... ఆఫీస్ కు వెళ్లడం, రావడం... ఇల్లు కూడా ఆఫీసే తప్ప ఇంకేం తేడా లేదు" అన్నారు. దాంతో అందరూ నవ్వేశారు. ముఖ్యమంత్రిగా గుజరాత్ ప్రజల సంక్షేమం మాత్రమే చూసేవాడినని, ఇప్పడు దేశ ప్రజలందరి సంక్షేమం చూడాలని ఆయన తెలిపారు. విద్య అనేది జీవితంలో చాలా నేర్పుతుందని ఆయన తెలిపారు. శిక్షణ లేకపోతే అనుభవాలు కూడా నిరాశనే నేర్పుతాయని ఆయన తెలిపారు. తనకు లభించిన శిక్షణ మంచిదేనని ఆయన తెలిపారు. ఇంతలో ఓ బాలిక ‘సార్ మీరు బాల్యంలో ఉండగానే ప్రధాని అవుతానని ఊహించారా? కల కన్నారా?’ అని అడిగింది. దానికి సమాధానమిస్తూ తాను సామాన్య కుటుంబం నుంచి వచ్చానని ఆయన తెలిపారు. తానెప్పుడూ కల కనలేదని ఆయన స్పష్టం చేశారు. ఏదయినా అవ్వాలని అనుకుని కాలేకపోతే నిరాశలో ఉండిపోతామని ఆయన చెప్పారు. తాను కనీసం స్కూల్ లీడర్ కూడా కాలేదని ఆయన తెలిపారు. తాను ప్రధాని అవుతానని అనుకోలేదన్నారు. జీవితాన్ని జీవితంలా తీసుకుని ముందుకు సాగుతుంటే ఏమవుతామో చూడాలని ఆయన వివరించారు. జీవితం మనల్ని ఏదో ఒక తీరానికి చేరుస్తుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News