: ‘టీచర్స్ డే’ సందర్భంగా గూగుల్ డూడుల్
భారత్ లో సెప్టెంబరు 5వ తేదీన (ఇవాళ) సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం (టీచర్స్ డే) జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించింది. ఉపాధ్యాయులు, పిల్లలకు సంబంధించి తరగతి గదిని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ డూడుల్ ని గూగుల్ తన హోం పేజీలో ఉంచింది.