: జమ్మూకాశ్మీర్ ను ముంచెత్తుతున్న వరదలు... 84 మంది మృతి
జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. దాంతో, ఇరవై రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా వరదలు ముంచెత్తాయి. గత 72 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. మరోవైపు కాశ్మీర్ వ్యాలీలోని వంద గ్రామాలు వరదల్లో చిక్కుకుపోయాయి. ఈ క్రమంలో ప్రజలందరూ తమ సామాన్లతో వేరే ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 84 మంది మరణించారు. మరోవైపు ప్రభుత్వం నుంచి సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.