: గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు
గణేష్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాదులోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు. ఈ సమయంలో హైదరాబాదులోని ప్రధాన కూడళ్లలో భారీ వాహనాల రాకపోకలు నిషేధిస్తున్నట్టు తెలిపారు. ప్రధాన కూడళ్లలో వాహన రాకపోకలు మళ్లించినట్టు ఆయన చెప్పారు. ట్రాఫిక్ ఆంక్షలకు లోబడి వాహనదారులు నడుచుకోవాలని ఆయన స్పష్టం చేశారు.