: గురుపూజోత్సవం సందర్భంగా పిల్లలకు మోడీ పాఠాలు
గురుపూజోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఢిల్లీలోని 700 మంది విద్యార్థులతో మోడీ సమావేశమయ్యారు. వి్ద్యార్థులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో మోడీ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. విద్యార్థుల సందేహాలకు మోడీ సమాధానమిస్తున్నారు.