: ఢిల్లీలో బీజేపీ సర్కారు వస్తే గుండు గీయించుకుంటా: సోమ్ నాథ్ భారతి
ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమ్ నాథ్ భారతి బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాను గుండు గీయించుకుంటానని ఆయన అన్నారు. ఒకవేళ బీజేపీ గనుక ఢిల్లీ రాష్ట్ర పగ్గాలు చేపడితే, అది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని వ్యాఖ్యానించారు. బీజేపీ అధికార దాహం నానాటికీ పెరిగిపోతోందని విమర్శించారు. ద్రవ్యోల్బణం అంశంపై వారు దృష్టి సారించాలని అన్నారు. అసలు ద్రవ్యోల్బణం విషయమై ఇప్పటివరకు వారేం చేశారని సోమ్ నాథ్ ప్రశ్నించారు.