: విజయవాడను రాజధానిగా ఎంపిక చేయడంపట్ల హర్షం వ్యక్తం చేసిన శివరామకృష్ణన్
విజయవాడ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడం పట్ల శివరామకృష్ణన్ (శివరామకృష్ణన్ కమిటీ చైర్మన్) హర్షం వ్యక్తం చేశారు. రాజధాని ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత పర్యావరణంపై పడే ప్రభావాన్ని ముందుగా ప్రభుత్వం స్టడీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక వసతుల కల్పన తర్వాతే ప్రభుత్వం రాజధానిని విస్తరించాలని ఆయన సూచించారు. చంద్రబాబునాయుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎవరికీ నష్టం కలగకుండా రాజధాని ఏర్పాటు చేస్తారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.