: పార్శిల్ విప్పిచూస్తే ఐఫోన్ లేదు..!


అమెరికా నుంచి తన బంధువు పంపిన పార్శిల్ ను ఆత్రంగా విప్పి చూసిన ఆ వ్యక్తి నిర్ఘాంతపోయాడు. దాంట్లో ఉండాల్సిన ఐఫోన్ స్థానంలో చిత్తు కాగితాలు కనిపించాయి. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన రాజగోపాల్ అనే వ్యక్తికి అమెరికా నుంచి ఆయన బంధువొకరు ఈ నెల 23న ఐఫోన్ ను ఎయిర్ పార్శిల్ ద్వారా పంపారు. దాని విలువ రూ.60 వేలు. రిజిస్టర్ ఎయిర్ మెయిల్ ద్వారా అందిన ఆ పార్శిల్ ను తెరిచి చూసిన రాజగోపాల్ కు చెత్తకాగితాలు వెక్కిరిస్తూ దర్శనమిచ్చాయి. ఈ విషయాన్ని ఆయన అమెరికాలో ఉన్న తన బంధువుకు తెలిపారు. పొరబాటు ఎలా జరిగిందో తమకు తెలియదని వారు చెప్పారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐఫోన్ ఎక్కడ మిస్ అయిందన్న విషయమై ప్రస్తుతం వారు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News