: షికాగో తరహ రాజధాని నిర్మాణం యోచనలో ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎలా ఉండబోతుందన్న ఆలోచన క్రమంలో ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. షికాగో తరహాలో రాజధాని నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కలసిన అమెరికా ప్రతినిధులు ఈ తరహా ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో భవనం 45 అంతస్తులతో, భిన్న కోణాల్లో వరుసగా ఉండేలా రూపొందించేందుకు పరిశీలిస్తున్నారట. ఏరియల్ వ్యూలో ఎన్టీఆర్ పేరు వచ్చేలా భవనాల నిర్మాణానికి ప్రతిపాదన చేశారు.