: ఇంటర్ నెట్ వచ్చిన తర్వాత విద్యార్థులే టీచర్లుకు చెప్పే పరిస్థితి వచ్చింది: బాబు
గుంటూరు జిల్లా రాష్ట్రానికి ఆదర్శమని... ఇక్కడ నుంచి ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లు అమెరికాలో మంచిపేరు తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 'డిజిటర్ ఇండియా'లో భాగంగా భారతదేశంలో మొదటిగా డిజిటల్ ఆంధ్రప్రదేశ్ ను తయారుచేద్దామని చంద్రబాబు అన్నారు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత విద్యార్థులే ఉపాధ్యాయులకు చెప్పే పరిస్థితి వచ్చిందని బాబు వ్యాఖ్యానించారు. ఈ కారణంగా, టీచర్లు ఎప్పటికప్పుడు తమ సబ్జెక్ట్స్ల్ లో అప్ డేట్ అవ్వాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో పుస్తకాలకు బదులుగా విద్యార్థులు ఐ ప్యాడ్ లు వాడతారని చంద్రబాబు జోస్యం చెప్పారు.