: ఐపీఎల్ లో ఆడనందువల్లే చతికిలబడ్డారు: అక్రం


ఐపీఎల్ కు మద్దతుగా పాకిస్థాన్ క్రికెట్ లెజెండ్ వసీం అక్రం రంగంలోకి దిగాడు. ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ ఐపీఎల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే అక్రం తనదైన శైలిలో విమర్శలు చేశాడు. ఐపీఎల్ లో ఆడకపోవడం వల్లే ఇంగ్లండ్ క్రికెటర్లు మినీ ఫార్మాట్లలో చతికిలబడుతున్నారని అన్నాడు. ఇంగ్లండ్ జట్టుకు ఈ ఏడాది ఆరంభంలో ఆసీస్ గడ్డపై 1-4 ఓటమి మొదలుకొని, ఇటీవల శ్రీలంక, భారత్ చేతిలో ఎదురైన వన్డే సిరీస్ పరాభవాలను అక్రం ఈ సందర్భంగా ఉదహరించాడు. ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా జట్లకు చెందిన ఆటగాళ్ళు మినీ ఫార్మాట్లలో చక్కగా రాణిస్తారని, అందుకు ఐపీఎల్ లో ఆడడమే కారణమని తెలిపాడు. ఇంతకుముందు ఐపీఎల్ లో కొంతమంది ఇంగ్లండ్ ఆటగాళ్ళు ఆడేవారని, ఇప్పుడదీ లేదని అన్నాడు. మినీ ఫార్మాట్లలో వారు విఫలమవ్వడానికి కారణం ఐపీఎల్ అనుభవం లేకపోవడమేనని సూత్రీకరించాడీ స్వింగ్ సుల్తాన్.

  • Loading...

More Telugu News