: మన పిల్లలకు సరైన విద్య అందిస్తే... ప్రపంచాన్ని శాసిస్తారు: చంద్రబాబు
గుంటూరులో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని తన గురువులైన మునిరెడ్డి, లక్ష్మణ్ రెడ్డిలను చంద్రబాబు సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విభజించారని అన్నారు. విద్యలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ముందుందని... మన పిల్లలకు సరైన విద్యను అందిస్తే ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో నూరు శాతం అక్షరాస్యత సాధించేలా ఉపాధ్యాయులు పనిచేయాలని చంద్రబాబు సూచించారు.