: అండర్ ట్రయల్ ఖైదీలను విడుదల చేయాలని సుప్రీం ఆదేశాలు


సుప్రీంకోర్టు ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ లేక జైల్లో మగ్గిపోతూ సగం శిక్ష పూర్తి చేసుకున్న అండర్ ట్రయల్ ఖైదీలందరినీ విడుదల చేయాలని కింది కోర్టులకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు వారికి బెయిల్ మంజూరు చేయాలని తెలిపింది. అంతేగాక రెండు నెలల్లో ఒక వారంలో జిల్లా జడ్జిలు జైళ్లను సందర్శించి అటువంటి అండర్ ట్రయల్ ఖైదీలను గుర్తించాలని చెప్పింది. ఈ క్రమంలో అక్టోబర్ ఒకటి నుంచి జ్యుడీషియల్ విచారణాధికారులందరూ కారాగారాలను సందర్శించాలని ఆదేశించింది. అంతేకాక ఖైదీలు విడుదలయ్యాక ఓ నివేదికను తమకు సమర్పించాలని తెలిపింది. దీనికితోడు, న్యాయవ్యవస్థకు ఆర్థికంగా సరైన మద్దతు లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం... మౌలిక సదుపాయాలు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరింది.

  • Loading...

More Telugu News