: ఉగ్రవాద సంస్థ 'ఐఎస్ఐఎస్'కు ఆకర్షితులైన హైదరాబాద్ విద్యార్థులు
ఇరాక్ లో నరమేధం సృష్టిస్తోన్న ఉగ్రవాద సంస్థ 'ఐఎస్ఐఎస్'కు మన దేశంలోని ఓ వర్గానికి చెందిన యువత కూడా ఆకర్షితమవుతోంది. ఈ క్రమంలో, హైదరాబాదుకు చెందిన కొందరు విద్యార్థులు ఐఎస్ఐఎస్ లో చేరేందుకు ఇక్కడ నుంచి బయలుదేరారు. అయితే వీరు భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దొరికిపోయారు. వారం క్రితం హైదరాబాదుకు చెందిన నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్టు బెంగాల్ పోలీసులు తెలిపారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్టు వెల్లడించారు.