: చాక్లెట్ల తియ్యదనం వెనుక దాగున్న చేదు నిజం


చాక్లెట్లు... చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు, సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు... ఎవరికైనా నోరూరిస్తాయి. అయితే, తీయదనాన్ని పంచే చాక్లెట్లలో హానికారక లోహాలు కూడా ఉన్నాయన్న వాస్తవం ఇప్పుడు చాక్లెట్ ప్రియులకు చేదును పంచుతోంది. చాక్లెట్లలో కాడ్మియం, సీసం వంటి ప్రమాదకరమైన లోహాల అవశేషాలు ఉన్నాయని... అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్దేశించిన మోతాదుల కంటే వీటి మోతాదు చాలా ఎక్కువగా ఉందని పరిశోధనల్లో తేలింది. బ్రెజిల్ లో కొనసాగిన పరిశోధనల్లో... మొత్తం 30 చాక్లెట్ల నమూనాలను పరిశీలించారు. అందులో రెండు నమూనాల్లో ఉండాల్సిన స్థాయికన్నా ఎక్కువ మోతాదులో కాడ్మియం, సీసం అవశేషాలున్నట్టు తేలింది. వాస్తవానికి చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, కాడ్మియం, సీసం వంటి లోహాలు మనకు హాని తలపెడతాయి. వీటి మోతాదు ఎక్కువైతే... తలనొప్పి, విరేచనాలు, కడుపునొప్పి వస్తాయి. కొంతమంది పిల్లల్లో ప్రవర్తన సంబంధిత సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది.

  • Loading...

More Telugu News